-->

PREPARATION FOR NEW YEAR- LET US EXAMINE OURSELVES

క్రొత్త సంవత్సరము సిద్దపాటు కొరకు కొన్ని అంశములు

స్తుతించవలసిన అంశములు

1.దేవుని గుణలక్షణములను బట్టి
2.దేవుడిచ్చిన ఉచిత రక్షణను బట్టి
3.దేవుడిచ్చిన కుటుంబము విషయమై
4.దేవుడిచ్చిన శాంతి, సమాధానమును బట్టి
( కుటుంబములో & వ్యక్తిగత జీవితములో)
5.ఆత్మసంబంధముగా జారిపోయిన 
    సందర్భములో లేవనెత్తినందుకు
6.ఆరోగ్యము మరియు స్వస్థత విషయమై
7. ప్రయణములలో దేవుని కాపుదల బట్టి
8. శారీరకంగా మరియు ఆత్మీయముగా పోషించిన
      విధానమును బట్టి
9.దేవుడిచ్చిన ఆత్మసంబంధమైన సంఘము మరియు
    నాయకుల విషయమై
10. ఆత్మీయముగా ఎదగడానికి దేవుడు మనకు
     పరిచయము చేసిన వ్యక్తుల బట్టి.
11.ప్రార్ధనలకు దేవుని జవాబు కొరకై
12.పని చేసే స్థలంలో దేవుడిచ్చిన కాపుదల

పశ్చాత్తాపపడవలసిన అంశములు

1.వ్యక్తిగత జీవితము
          * దేవునితో సహవాసము
          * ప్రార్థన / ఒంటరి ప్రార్థన
          * వాక్య పఠనం / వాక్యధ్యానము
          * లోక సంబంధమైన ఆశల వైపు చూసిన
              సందర్భాల విషయమై
           * మనం తీసుకున్న తప్పైన ( స్వంత)
              నిర్ణయాల విషయమై
2.ఒక భర్తగా/ భార్యగా బాధ్యత విషయములో
    తప్పిపోయిన వాటి గురించి
3.ఒక తల్లి గా /తండ్రిగా బాధ్యత విషయములో
    తప్పిపోయిన వాటి గురించి
4.తల్లిదండ్రులకు అవిధేయులుగా వున్న
     సందర్భాల విషయమై
5.దేవుడిచ్చిన సమయాన్ని వ్యర్ధ పరచుకున్న విషయమై
6. సంఘ బాధ్యత/ సువార్త ప్రకటించే / ఇతరులను
      సంఘమునకు ఆహ్వానించే విషయములో
      తప్పిపోయిన వాటి గురించి.
7. పనిచేసే స్థలంలో తప్పిపోయిన విషయాలు,
     తద్వారా దేవుని నామమునకు అవమానము
     తెచ్చిన విషయాల గూర్చి

ప్రార్ధించవలసిన అంశములు

1.పశ్చాత్తాపపడిన విషయాలలో మరలా తప్పిపోకుండా           దేవుని శక్తి కొరకు
2.స్తుతించిన అంశములలో - ఇక ముందు కూడా దేవుని          కృప, సహాయము మరియు కాపుదల కొరకు
3. మారుమనస్సు లేనివారు మారుమనస్సు కొరకు
4.నూతన సంవత్సర వాగ్దానము కొరకు మరియు                   దేవుని నడిపింపు కొరకు
5.ఎంతో కాలంగా దేవుని వాక్యము వింటూ, దేవునికి             లోబడనివారి కొరకు
6.దేవుని సేవ విస్తరించునట్లు
                                                            - శుభవచనం