అడా లీ (1856-1948)
అడా లీ (1856-1948) భారత దేశములో సేవ చేసిన మిషనరీ
అడా లీ (1856-1948)
"నా తలంపులు మీ తలంపులవంటిని కావు... నేను మిమ్మునుగూర్చి ఉద్దేశించిన సంగతులను నేనెరుగుదును, రాబోవు కాల మందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములేగాని హానికరమైనవి కావు; ఇదే యెహోవా వాక్కు అని యెషయా 55:10 మరియు యిర్మీయా 29:11 వచనములలో చెప్పబడిన మాటలు అడా లీ యొక్క జీవితములో అక్షరాలా ఋజువు కావడం మనము చూడవచ్చు. అడా లీ 23.03.1856 లో అమెరికాలోని వెస్ట్ వర్జీనియలో జన్మించారు. తన బిడ్డలను దైవ భయముతో పెంచి, దేవుని సేవ కొరకై వారిని సమర్పించిన ఆమె. వారు ప్రజలను దేవుని వైపుకు మళ్ళించగా చూడవలెనని ఎల్లప్పుడూ ప్రాంర్ధించేవారు. అయితే ఆమె ప్రార్ధనలకు జవాబు లభించినదా?
నేను మిమ్మునుగూర్చి ఉద్దేశించిన సంగతులను నేనెరుగుదును, రాబోవు కాలమందు మీకు నిరీక్షణకలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములేగాని హానికరమైనవి కావు; ఇదే యెహోవా వాక్కు. యిర్మీయా 29:11
ఇరవై సంవత్సరాల యుక్త వయసులో ఆడా హిల్లెగార్డ్ జోన్స్ లీ భారతదేశములో అడుగుపెట్టారు. ఆమె కలకత్తాలో బెంగాల్ స్త్రీల మధ్య ఐదు సం|| ల పాటు సేవ చేశారు. భారతదేశములో సేవ చేస్తున్న అమెరికా దేశపు మరొక మిషసరీ అయిన డేవిడ్ హిరామ్ లీతో 1881వ సం|| లో ఆమెకు వివాహం జరిగింది. కాగా, వారిరువురు కలిసి కలకత్తాలో పాఠశాలలను స్థాపించారు. దేవుని సేవ చేయుటకు ప్రజలకు శిక్షణనిచ్చారు మరియు పేద పిల్లలకును, బాల్యవివాహాల వంటి మూఢాచారాలకు మరియు వ్యభిచారము వంటి సామాజిక కీడులకు బలైన పిల్లలకును ఆశ్రయమయ్యారు.
1899వ సంll లో ఆ మిషనరీ కుటుంబములో విషాదం అలుముకుంది. డార్జిలింగ్ లో ప్రకృతి విపత్తు కలిగి కొండచరియలు విరిగిపడటంతో అక్కడ చదువుకుంటున్న వారి ఆరుగురు పిల్లలు మరణ ద్వారంలోకి ప్రవేశించవలసి వచ్చింది. ఆ ఆరుగురిలో ప్రాణాలతో బయటపడిన వారి కుమారుడు విల్బర్, ఆసుపత్రిలో ఉన్నప్పుడు ఆ విపత్తు సమయములో జరిగిన దానిని గురించి వారికి తెలియపరిచాడు. ఆ సమయములో మరణాన్ని ఎదుర్కొనుటకు దేవుడు వారికి అపారమైన ధైర్యమును ఇచ్చాడని, మరణించిన తరువాత పరలోకములోకి ప్రవేశిస్తామన్న నిశ్చయతను కలియుండుట వలన వారు మరణించుటకు భయపడలేదని విల్బర్ చివరి ఘడియల గురించి వివరించాడు. కొన్ని రోజులు ఆసుపత్రిలో తీవ్రమైన శారీరక బాధను అనుభవించిన తరువాత, విల్బర్ కూడా పరమందు తన సోదరీసోదరులను చేరుకున్నారు.
పిల్లల అకాలమరణం అడాకు గొప్ప ఆత్మీయ పోరాటంగా మారింది. ఆమె ప్రార్ధనలకు దేవుడు జవాబివ్వలేదనే ఆలోచనలతో సాతాను ఆమె విశ్వాసమును కబళించుటకు ఎంతగానో దాడి చేశాడు. శోధిస్తున్న అపవాదిని జయించుటకు తనకు బలమును దయచేయుమని ఆమె దేవుని యొక్క సహాయము కొరకై ఆయన సన్నిధిలో ఎంతగానో మొరపెట్టారు. కాగా, అమెరికా అంతటా వారి పిల్లల యొక్క జీవిత సాక్ష్యములు ఏవిధముగా ప్రచురించబడి, ప్రసంగాలలో చెప్పబడుతున్నాయో మరియు వారి మాదిరికరమైన జీవితాలు ఏవిధముగా ప్రజల హృదయాలను కదిలించి వారిని దేవుని వైపుకు తిప్పుతున్నాయో ఆమెకు చెప్పబడినప్పుడు, ఆమె ఆయన యొక్క అద్భుతమైన ప్రణాళికలను బట్టి దేవునిని స్తుతించింది. ఆమె ప్రార్థనలకు ఆయన జవాబు దయ చేసినందుకు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు!
లీ మెమోరియల్ మిషన్
లీ మిషనరీ దంపతులు తమ చివరి శ్వాస వరకు భారతదేశంలో తమ సేవను కొనసాగించారు. కలకత్తాలోని "ది లీ మెమోరియల్ మిషన్' త్యాగసహితమైన వారి సేవ యొక్క ఫలముగా ఈ నాటికీ మన కన్నుల ముందు నిలిచియున్నది. అడా లీ 11.06.1948 న తుది శ్వాస విడిచి ప్రభు సన్నిధిని చేరారు.


Post a Comment